రన్నింగ్ vs స్కిప్పింగ్.. వేగంగా బరువు తగ్గాలంటే రెండింట్లో ఏది బెస్ట్?

iDreampost.Com

ఇప్పుడు అందరి జీవితాలు బిజీబిజీగా మారాయి. పొద్దున లేచింది మొదలు స్టడీస్, జాబ్స్, బిజినెస్ అంటూ అందరూ రన్నింగ్ రేస్ మాదిరిగా పరిగెడుతున్నారు.

iDreampost.Com

 ఎవరికీ టైమ్ కు తినేంత, సరిగ్గా నిద్రపోయేంత తీరిక ఉండట్లేదు. మారిన లైఫ్ స్టైల్, ఫుడ్ హాబీస్ వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారు.

iDreampost.Com

 శారీరక శ్రమ లేకుండా చేసే డెస్క్ జాబ్స్, పని ఒత్తిడి తీవ్రమవడంతో అధిక బరువు సమస్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది.

iDreampost.Com

ఒబెసిటీ వల్ల షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే ఛాన్స్ అధికంగా ఉంది. అందుకే బరువు తగ్గడంపై చాలా మంది ఫోకస్ చేస్తున్నారు.

iDreampost.Com

 సన్నగా, ఫిట్ గా మారేందుకు కొందరు జిమ్ లు, యోగా సెంటర్లను  ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు ఇంటి వద్దే రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి చేస్తున్నారు.

iDreampost.Com

రూపాయి ఖర్చు లేకుండా కొవ్వు కరిగించేందుకు రన్నింగ్, స్కిప్పింగ్  ఉపయోగపడతాయి. అయితే వేగంగా బరువు తగ్గేందుకు ఈ రెండింట్లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

iDreampost.Com

రన్నింగ్, స్కిప్పింగ్.. కండరాలను బలంగా, దృఢంగా చేయడానికి ఈ రెండూ దోహదపడతాయి. ఎక్కువ క్యాలరీను కరిగించేందుకు ఉపయోగపడతాయి.

iDreampost.Com

 రన్నింగ్ తో పోలిస్తే స్కిప్పింగ్ చేయడం కొంచెం కష్టం. కానీ తక్కువ టైమ్ లో బరువు తగ్గాలంటే అదే బెస్ట్ అని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

iDreampost.Com

వేగంగా బరువు తగ్గాలనుకునేవారు వాకింగ్, రన్నింగ్ కంటే క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయడం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

 క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేస్తే పది రోజుల్లోనే శరీరంలో తేడాను గమనిస్తారని.. డైట్ కూడా మెయింటెయిన్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారని అంటున్నారు.

iDreampost.Com

స్కిప్పింగ్ వల్ల బరువు తగ్గడమే గాక కండరాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి.

iDreampost.Com

 రన్నింగ్ వల్ల గుండె కండరాలు బలంగా తయారవుతాయి. కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే శరీరంలోని ఎండార్ఫినన్, సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.

iDreampost.Com

రన్నింగ్ చేయడం వల్ల ప్రెజర్, డిప్రెషన్ లాంటి వాటిని తరిమికొట్టొచ్చు.

iDreampost.Com

స్కిప్పింగ్, రన్నింగ్ రెండూ చేయడం మంచిదే. అయితే త్వరగా బరువు తగ్గాలనుకునేవారు స్కిప్పింగ్ ను ఎంచుకుంటే బెస్ట్ అని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం