ఒకసారి వాడిన వంట నూనె మళ్లీ వాడుతున్నారా? ప్రాణాలు పోవచ్చు!

Tooltip

ఇప్పుడు అందరికీ ఆరోగ్యం అంటే శ్రద్ధ పెరిగిపోయింది.

Tooltip

ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

Tooltip

వంటనూనెలు కూడా సన్ ఫ్లవర్, రైస్ రిచ్ వంటివి ఆయిల్స్ వాడుతున్నారు.

Tooltip

అంత వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆయిన్ మళ్లీ మళ్లీ వాడటంతోనే తలనొప్పి వస్తోంది.

Tooltip

ఇంట్లో వంటలు అన్నాక ఒక్కోసారి ఆయిల్ ని మళ్లీ వాడాల్సి వస్తుంది.

Tooltip

గారెలు, పిండి వంటలు చేస్తే నూనె ఎక్కువ మిగిలిపోతుంది.

Tooltip

అలాంటి నూనెను మళ్లీ కూరలు, టిఫిన్స్ కోసం వాడేస్తుంటారు.

Tooltip

అలా మీరు వంటనూనె పదే పదే బర్న్ చేయడం చాలా ప్రమాదకరం.

Tooltip

ముఖ్యంగా ఆ నూనెలో ఉండే న్యూట్రీషియన్ వ్యాల్యూస్, విటమిన్స్ ని మీరు లాస్ అవుతారు.

Tooltip

ఒకసారి వాడిన నూనెలో అక్రిలామిడ్, అల్డిహైడ్స్, పోలార్ కాంపౌండ్స్ వంటి హానికారకాలు ఉండచ్చు.

Tooltip

వాడేసిన నూనెలో గత వంట తాలూకా ఫ్లేవర్స్, రంగు ఉండచ్చు.

Tooltip

ఒకసారి వాడిన నూనెలో మైక్రో బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరగచ్చు.

Tooltip

వాడేసిన నూనె త్వరగా నల్లగా అవుతుంది. దాని వల్ల వంట కూడా మాడిపోయే ప్రమాదం ఉంటుంది.

Tooltip

పదే పదే అదే నూనెలో వండిన ఆహారం తీసుకుంటే క్యాన్సర్, మలబద్దకం, కార్డియోవాస్కులర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

Tooltip

గమనిక ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. రీ యూజ్డ్ ఆయిల్ కి సంబంధించి నిపుణులు, వైద్యుల సలహా సూచనలు తీసుకోండి.