RO ప్యూరిఫైయర్‌ వేస్ట్‌ వాటర్‌ను మళ్లీ వాడుతున్నారా? అయితే ఇది చూడండి

Tooltip

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్‌ఓ వాటర్‌ ప్యూరిఫైయర్‌ను ఎక్కువగా వాడుతున్నారు.

Tooltip

చాలా మంది ఇళ్లలో ఈ ఆర్‌ఓ ప్యూరిఫైయర్లు కనిపిస్తున్నాయి.

Tooltip

అయితే.. ఈ ఆర్‌ఓ ప్యూరిఫైయర్‌ నుంచి సాధారణంగా 3 లీటర్ల నీటి నుంచి ఒక లీటరు నీటిని శుద్ధి చేయగలదు.

Tooltip

శుద్ధి అయిన తర్వాత.. వేస్ట్‌ వాటర్‌ కింద వచ్చే నీళ్లు కూడా చూడ్డానికి బాగానే ఉంటాయి.

Tooltip

 దీంతో ఆ నీళ్లను కూడా కొంతమంది ఇతర పనులకు వాడుతుంటారు. స్నానం చేయడం, బట్టలు ఉతికేందుకు అలా..

Tooltip

అయితే.. ఆ వేస్ట్‌ వాటర్‌తో అలా స్నానం చేయవచ్చా? లేదా? ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Tooltip

ఆ వేస్ట్‌ వాటర్‌ను తాగడానికి, స్నానం చేయడానికి వాడకూడదు.

Tooltip

ఎందుకంటే ఆ నీటిలో కరిగిన ఘనపదార్థాలు(TDS) ఎక్కువగా ఉంటాయి.

Tooltip

టీడీఎస్‌ ఎక్కువగా ఉన్న నీరు తాగడానికి పనికి రాదు.

Tooltip

ఆ నీటితో స్నానం చేస్తే చర్మం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

Tooltip

 ఆర్‌ఓ వేస్ట్‌ వాటర్‌లో అకర్బన లవణాలు, సేంద్రియ పదార్థాలు, మలినాలు ఉండటం వల్ల వాటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావొచ్చు.

Tooltip

ఆర్‌ఓ వేస్ట్‌ వాటర్‌ను వాహనాలను క్లీన్‌ చేసుకోవడానికైతే హాయిగా వాడుకోవచ్చు.

Tooltip

అలాగే టాయిలెట్‌ శుభ్రం చేయడానికి, ఇళ్లు తుడుచుకోవడానికి కూడా వాడొచ్చు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం