ట్యాక్స్‌ పేయర్స్‌కు ఊరట! వారికి జీరో ట్యాక్స్‌..

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్‌ 2024 వచ్చేసింది.

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

ఈ బడ్జెట్‌తో చిరు ఉద్యోగులకు కాస్త ఊరట లభించనుంది.

కొత్త పన్ను విధానంతో రూ.3 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులేదు.

వార్షిక ఆదాయం రూ.3 లక్షలు దాటితేనే పన్ను పడనుంది.

కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబులు ఈ విధంగా ఉన్నాయి.

రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను విధించనున్నారు.

 రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే 10 శాతం.

 రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలలోపు 15 శాతం పన్ను.

రూ.12 నుంచి రూ.15 లక్షలలోపు 20 శాతం.

రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే.. 30 శాతం పన్ను విధించనున్నారు.

మొత్తంగా ట్యాక్స్‌పేయర్స్‌ రూ.17,500 మిగుల్చుకునే అవకాశం ఉంది.

 పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు.