టొమాటో రసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా !

టొమాటో రసంలోని అధిక నీరు.. శరీరాన్ని తీవ్రమైన వ్యాయామం నుండి పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

టమోటా రసంలో  ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ ఇలా అనేక పోషకాలు లభిస్తాయి. 

దీనిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

టొమాటో రసం కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. 

 దీనిని తాగడం వలన అధిక రక్తపోటు క్రమంగా తగ్గుతుంది.'

అంతేకాకుండా బరువు తగ్గించడంలో టొమాటో రసం మేలు చేస్తుంది. 

 ఈ రసంలో యాంటీ-కార్సినోజెనిక్ ప్రభావం వుండటం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా తగ్గించవచ్చు.

 పైగా యాంటీ ప్లేట్‌లెట్ చర్యను కలిగి ఉంటుంది కనుక రక్తం గడ్డకట్టడాన్ని ఆపవచ్చు.

 ఇక టొమాటో రసం తాగేవారి ఎముక ఆరోగ్యం చక్కగా వుంటుంది.