వేసవి వచ్చింది.. ఎలాంటి సన్‌స్క్రీన్‌ లోషన్‌ ఎంచుకోవాలంటే

వేసవి కాలం రాలేదు.. ఎండలు మండి పోతున్నాయి.

ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడం కోసం సన్‌స్క్రీన్‌ లోషన్‌ కచ్చితంగా వాడాలి.

ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరి.

సన్‌ స్క్రీన్‌ లోషన్‌ ఎందుకు వాడాలి అంటే.. 

సూర్యరశ్మిలో ఉండే యూవీఏ, యూవీబీ కిరణాలు చర్మాన్ని నేరుగా తాకితే 

చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు

నల్ల మచ్చులు, ముడతలు వస్తాయి.

కొన్ని సార్లు చర్మ క్యాన్సర్లకు కూడా దారితీయవచ్చు.

ఈ సమస్యల బారిన పడకుండా ఉండటం కోసం సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి.

మీరు ఎంచుకునే సన్‌స్క్రీన్‌ లోషన్‌లో..

టైటానియం డై ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, ఆక్సీబెంజాన్, ఏవో బెంజాన్, మెక్సోరిల్ 5X ఉండాలి.

ఇవి చర్మాన్ని రక్షణ కవచంలా కాపాడతాయి.

సన్‌స్క్రీన్‌ లోషన్‌ ఎంపికలో ఎస్‌పీఎఫ్‌ శాతం ఎంతో ముఖ్యం.

సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్‌నే ఎస్‌పీఎఫ్‌ అని పిలుస్తారు.

సన్‌స్క్రీన్ లోషన్లలో ఇది కనీసం 15 శాతమైనా ఉండాలి.

అంతకంటే తక్కువ ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడినా లాభం ఉండదు.

30 శాతం ఎస్‌పీఎఫ్‌ సన్‌స్క్రీన్‌ లోషన్‌లైతే మరీ మంచిది.