పిల్లలు ఫోన్ చూసినా కంటి సమస్యలు రాకూడదంటే ఇలా చేయండి!

Arrow

ఆడుకోవడానికి, చదువుకోవడానికి పిల్లలకు ఫోన్ లేదా ట్యాబ్ ఇస్తుంటారు. అయితే దీని వల్ల కంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Arrow

గంటల పాటు ఫోన్ చూడడం వల్ల పిల్లల్లో డ్రై ఐ డిసీజ్ (డీఈడీ) వస్తుందని పరిశోధనల్లో తేలింది.

Arrow

రోజులో 3 నుంచి మూడున్నర గంటల సేపు ఫోన్లు వాడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డీఈడీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

Arrow

దీని వల్ల కళ్ళ నుంచి నీళ్లు రావు.. త్వరగా కన్నీళ్లు ఆవిరైపోవడం, అసౌకర్యాన్ని కల్గించడం, కళ్ళు ఎరుపెక్కడం, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Arrow

అందుకే 3 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఫోన్ ఇవ్వాలని సూచిస్తున్నారు.  

Arrow

యావరేజ్ గా 11 ఏళ్ళు ఉన్న 462 మంది స్కూల్ పిల్లలపై పరిశోధన చేయగా వారిలో కంటి సమస్యలు ఉన్నాయని తేలింది.  

Arrow

ఫోన్ లేదా ట్యాబ్స్ ని ఎక్కువ సేపు చూస్తున్నట్లైతే కనురెప్పలు ఆడించరు. దీని వల్ల 20 శాతం పిల్లల్లో కళ్లపై రెట్టింపు భారం పడుతుంది.

Arrow

8 ఏళ్ళు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు యావరేజ్ గా రోజులో 2 గంటల 19 నిమిషాలు ఫోన్ స్క్రీన్ చూస్తున్నట్లు తేలింది.  

Arrow

చదువుకోవడానికి ఫోన్, ట్యాబ్ లెట్స్ ఇవ్వడం తప్పనిసరి అన్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

Arrow

ప్రతీ 20 నిమిషాలకొకసారి ఫోన్ లేదా ట్యాబ్ స్క్రీన్ నుంచి పిల్లల దృష్టిని మరల్చాలి.

Arrow

20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై కనీసం 20 సెకన్ల పాటు పిల్లలు దృష్టి పెట్టాలని చెబుతున్నారు.    

Arrow

గంటలో ప్రతి 10 నిమిషాలకొకసారి పిల్లలను ఫోన్లు, ట్యాబ్స్ నుంచి దూరం చేస్తే ఎలాంటి కంటి సమస్యలు రావని చెబుతున్నారు