వర్షాకాలంలో చిన్నారుల కోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

వర్షాకాలం ప్రారంభంకావడంతో వానలు కురుస్తూనే ఉన్నాయి.

ఈ వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.

సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం వేధిస్తుంటాయి.

పెద్ద వారితో పాటు పిల్లల్లో కూడా సీజనల్ వ్యాధులు సోకుతుంటాయి.

వర్షాకాలంలో చిన్న పిల్లల తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

చిన్నారులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

స్నానానికి ముందు ఆయిల్ తో మసాజ్ చేసి గోరు వెచ్చని నీటితో స్నానం చేయించాలి.

పరిశుభ్రమైన పొడి బట్టలను వేయాలి.

పిల్లలను ఉంచే గదిలో దోమలు, బొద్దింకలు, ఇతర క్రిములు లేకుండా జాగ్రత్త పడాలి.

ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలైన పండ్లు, పాలను అందించాలి.

పండ్లను పరిశుభ్రంగా కడిగి పిల్లలకు అందించాలి.

వర్షాకాలానికి ముందే కాలానుగుణంగా వేసే వ్యాక్సిన్లను పిల్లలకు ఇప్పించాలి.

వేడి చేసి చల్లార్చిన నీటిని పిల్లలకు అందించాలి.