వర్షాకాలంలో కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు అవసరం

సర్వేంద్రియానాం నయనం ప్రధానం.

అంధకారమైన జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.

కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

వర్షాకాలంలో కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి.

జాగ్రత్తలు పాటిస్తే కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.

మురికి చేతులతో కళ్లను రుద్దినప్పుడు మలినాలు చేరి ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కళ్లను చేతితో తాకకూడదు.

వర్షాకాలంలో ఫ్లూ, వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వంటివి కళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి.

వర్షాకాలంలో కళ్లకు వచ్చే వ్యాధుల్లో కండ్లకలక ఒకటి. దీని వల్ల కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది.

కళ్లలోకి నీరు పోవడం, కలుషితమైన నీటితో ముఖం కడుక్కున్నప్పుడు నీరు కండ్లలోకి వెళ్లడం వల్ల కండ్లకలక వస్తుంది.

టవల్స్, హ్యాండ్ కర్ఛీఫ్ వంటి వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు.

కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను విరామం లేకుండా చూడకూడదు.

కంటి సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి.

విటమిన్ ఎ, సీ లభించే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం