వర్షాకాలంలో ట్రిప్ ప్లాన్ చేశారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వర్షాకాలంలో విహారయాత్రలకు వెళ్లాలని చాలా మందికి కోరికగా ఉంటుంది.

అలా అని అనుకున్న వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవు.

రైనీ సీజన్ లో ట్రిప్ కు వెళ్లే వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. ఎక్కడికి వెళ్లినా ఇబ్బందులు పడరు. అవేంటో చూద్దాం పదండి.

ముందుగా మీరు ఏ ప్రాంతానికి వెళ్లాలి అనుకుంటున్నారో దాని గురించి పూర్తిగా తెలుసుకోండి.

భారీ వర్షాలు పడే ప్లేసుల కంటే.. తేలికపాటి జల్లులు కురిసే ప్రాంతాలకు వెళ్లడం మంచిది.

అనుకోకుండా వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ముందుగా రెయిన్ కోట్, గొడుగు, వాటర్ ఫ్రూప్ జాకెట్లను తీసుకెళ్లండి.

ట్రిప్ కు త్వరగా ఆరిపోయే దూస్తులను తీసుకెళ్లడం ఉత్తమం. సిల్క్, జార్జెట్ దుస్తులు మేలు.

విహారయాత్రలకు వెళ్లే ముందు తప్పనిసరిగా మందులు, ఎమర్జెన్సీ కిట్ మన లగేజీలో ఉండాలి.

ఇక ల్యాప్ ట్యాప్స్, ఫోన్స్, కెమెరా వంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తడవకుండా ఉండటానికి వాటర్ ప్రూఫ్ కవర్లు, బ్యాగులు తీసుకెళ్లాలి.

మరీ ముఖ్యంగా అడవి, కొండ ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్యలు ఉంటాయి. కాబట్టి.. ముందుగానే కావాల్సినంత లిక్విడ్ మనీని తీసుకెళ్లాలి.

పై జాగ్రత్తలతో పాటుగా మరికొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మీ ట్రిప్ ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో సరదాగా సాగుతుంది.