వర్షాకాలంలో హైదరాబాద్‌కు సమీపంలో సందర్శించాల్సిన ప్రదేశాలు

వానా కాలంలో ప్రతి ఒక్కరూ తప్పకుండ సందర్శించాల్సిన ప్రదేశాలు హైదరాబాద్ కి సమీపంలో ఉన్నాయి.

గండి కోట  (తమిళనాడుకు 380 కీ.మీ.)

 గండికోటను గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా అని అంటారు. గండి కోట పెన్నార్ నది ద్వారా ఏర్పడిన కొండగట్టు. వర్ష కాలంలో ఈ ప్రదేశం ప్రకృతి రమణీయంగా ఉంుటంది. 

అరకు లోయ , ఆంధ్రప్రదేశ్ (720 కీ.మీ దూరం)

 ఏపిలోని అరకు లోయ అందాలు ఎంత చూసినా తనవితీరదు.జలపాతాలు, గిరిజన సంస్కృతి, కాఫీ తోటలు అంతా పచ్చదనంతో అద్భుంగా ఉంటుంది.

హర్సిలీ హిల్స్, ఆంధ్రప్రదేశ్  (547 కీ.మీ)

 హర్సిలీ హిల్స్.. 4100 అడుగులత ఎత్తులో ఉంది. ఇది ఏపీకీ మనోహరమైన హిల్ స్టేషన్.  ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది.

నాగార్జున సాగర్ డ్యామ్, తెలంగాణ (155 కీ.మీ.)

పచ్చని కొండల్లో జలపాతాలు, రిజర్వాయర్ అద్భుత దృశ్యాలు. వర్షాకాలంలో సాగర్ డ్యామ్ గేట్లు తెర్చుకున్నపుడు వెళ్లి చూస్తే తెగ ఎంజాయ్ చేస్తారు.

వరంగల్, తెలంగాణ  (146 కి.మీ.)

తెలంగాణలో వరంగల్ కోట, వేయి స్తంబాల ఆలయానికి ప్రసిద్ది చెందింది. ఇక్కడ వర్షాకాలంలో పచ్చటి వాతావరణం అద్భుతంగా ఆకర్షిస్తుంది.

బీదర్, కర్ణాటక  (140 కి.మీ.)

బీదర్ చారిత్రక కట్టడాలు బాగా ఆకర్షిస్తాయి. వర్షాకాలంలో ఇక్కడ అహ్లాదకరమైన వాతగావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు బాగా ఆకట్టుకుంటాయి.

పోచారం వన్య ప్రాణుల అభయారణ్యం, తెలంగాణ  (108 కీ.మీ) 

తెలంగాణలో ఉన్న పోచారం వన్య ప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులను, వన్య ప్రాణుల ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుంది.

భువనగిరి కోట, తెలంగాణ  (105 కి.మీ.)

యాదాద్రి జిల్లా భువనగిరి కోట ఏకశిల రాతి కొండపై ఏర్పాటు చేయబడ్డ కట్టడాలు బాగా ఆకట్టుకుంటాయి.వర్షాకాలంలో చుట్టు పక్కల పచ్చటి పరిసరాలు, చల్లని వాతావరణం  ఈ కోట అందాన్ని పెంచుతాయి.

అనంతగిరి హిల్స్, తెలంగాణ  (79 కీ.మీ.)

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు దట్టమైన అడవుల్లో ఉన్నాయి.కొన్ని ప్రదేశాలలో జలపాతాలు, పచ్చటి వాతావరణం స్వర్గధామంలో ఉంటాయి.