భూతాలకు, ప్రేతాత్మలకు పూజలు చేసే నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి

దేవుళ్లను నమ్మేవాళ్ళలో దయ్యాలను కూడా నమ్మేవాళ్ళు ఉంటారు. ఏదైనా కీడు జరిగితే దయ్యం పట్టిందనుకుని శాంతి పూజలు చేయించుకుంటారు.

కొంతమంది ఇతరుల ఎదుగుదలను ఆపడం కోసం దయ్యాలను వశపరచుకునే తాంత్రికుల దగ్గరకు వెళ్తారు.  

నిజానికి ఇవి జరుగుతాయో లేదో తెలియదు గానీ ఇప్పటికీ నమ్మి భూతాలకు, ప్రేతాత్మలకు పూజలు చేసే ప్రాంతాలు ఈ దేశంలో ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ కూడా ఉంది.

కేరళ: కేరళలో చాలా ప్రాంతాల్లో చేతబడులు చేస్తారు. భూతాలకు, ప్రేతాత్మలకు పూజలు చేస్తారు. కేరళలో ఉన్న త్రిషోర్ లో కూడా తాంత్రిక పూజలు చేస్తారు. ఇక్కడ మంత్ర, తంత్ర విద్యలు నేర్చుకుని మరీ ప్రాక్టీస్ చేయడం ఇప్పటికీ కొనసాగుతుంది. 

వారణాసి: వారణాసిలో అతిపెద్ద స్మశానవాటికలో నాగసాధువులు తాంత్రిక పూజలు చేస్తుంటారు. విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చి ఈ విద్యలు నేర్చుకుంటారు.

కోల్కతా: కోల్కతాలోని నిమ్తాల ఘాట్ అనే స్మశానవాటిక రాత్రి పూట తాంత్రిక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఊరి వాళ్ళెవరూ అటువైపు వెళ్ళరు.

అస్సాం: అస్సాంలోని మయాంగ్ గ్రామంలో తాంత్రిక విద్యలు ప్రదర్శిస్తారు. ఇక్కడకు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయరు.

ఒడిశ్శా, హైదరాబాద్: ఒడిశ్శాలోని కుశభద్ర నాదీ తీరంలో నాగసాధువులు తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్ లోని సుల్తాన్ షాహీ ప్రాంతం సహా పలుచోట్ల చేతబడులు జరుగుతున్నాయి.

పురుషులే కాకుండా మహిళలు కూడా చేతబడులు, తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. కష్టాల్లో ఉన్నవారిని లోబరుచుకుని వ్య*భిచార వృత్తిలోకి దింపుతున్నారు.