పీరియడ్స్ నొప్పా..  అయితే ఈ టీ ట్రై చేయండి

పొద్దున్న లేవగానే టీ, కాఫీ కడుపులో పడనిదే పని మొదలుపెట్ట బుద్ది కాదు

ముఖ్యంగా వేడి వేడగా టీ తాగుతుంటే.. ఎంతో రిఫ్రెస్‌గా ఫీలవుతుంటారు.

ఒకప్పుడు టీ, పాలు మిక్సింగ్ చేసిన టీనే ఎక్కువ తాగేవారు

కానీ అది కాస్త అనారోగ్యానికి దారి తీస్తుందని తెలిసి ఈ మధ్య కాలంలో హెల్త్ టీలు ట్రై చేస్తున్నారు

గ్రీన్ టీ, శంఖు పూల టీ, తులసి టీ, లెమన్ టీ, అల్లంటీ, మందారం, గులాబీ పువ్వులతో చేసిన టీని సేవిస్తున్నారు.

ఇప్పుడు కొత్తగా మరో టీ అందుబాటులోకి వచ్చింది  అదే లోటస్ టీ.

ఆయుర్వేదం ప్రకారం.. తామర పువ్వులో ఎన్నో ఖనిజాలు, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి.

అలాగే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ నిండి ఉన్నాయి. అందుకే ఈ కొత్త టీని ట్రై చేస్తున్నారు

అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందట

ముఖ్యంగా మహిళలకు పీరియడ్స్  సమయంలో వచ్చే నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం లభిస్తుందట

కొద్దిగా నీళ్లు పోసి.. అందులో నాలుగు తామరాకు రెమ్మలు వేసి మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

తామర పువ్వులో ఉండే అపోమోర్ఫిన్ , న్యూసిఫెరిన్ అనే పోషకాలు ఒత్తిడి, నిరాశ, ఆందోళనను తగ్గిస్తాయి

అంతేకాదు జ్వరం, తలనొప్పి, చికాకు వంటి సమస్యలను నివారిస్తుంది ఈ  టీ.

మర పువ్వులో ఉండే విటమిన్ బి, సి, ఐరన్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట

శరీరంలో ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి ఈ టీ ఎంతో తోడ్పడుతుంది

హైబీపీని కంట్రోల్ చేస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం