ఈ లక్షణాలు ఉన్నవారు  బీట్‌రూట్ తింటే అంతే సంగతులు!

బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంత  మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఇంత మేలు చేసే బీట్‌రూట్ కొందరికి మాత్రం చాలా డేంజర్‌.

ఇంతకీ బీట్‌రూట్‌ను ఎవరు తీసుకోకూడదు.? తీసుకుంటే ఎలాంటి నష్టం జరుగుతుంది!

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తుంది.

కాబట్టి, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వాళ్ళు దీనిని తినకూడదు.

స్కిన్‌ ఎలర్జీతో బాధపడేవారు కూడా బీట్‌రూట్‌ కు దూరంగా ఉండాలి.

బీట్‌రూట్‌లో ఉన్న పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

కాబట్టి, తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్‌ను అస్సలు తినకూడదు.

అంతే కాకుండా కాలేయ సమస్యలు ఉన్న వారు కూడా బీట్‌రూట్‌ ను తీసుకోకపోడం మంచిది.