ఈ ఫుడ్స్ తో  పీరియడ్స్ సమయంలో నొప్పి మాయం..

చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన  పెయిన్స్ వస్తూ ఉంటాయి.  

అయితే ఆ సమయంలో వీటిని తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

కమలా పండు:  పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గించే  బెస్ట్ ఫుడ్స్ లో కమలా ఒకటి

దీనిలో విటమిన్ సి , మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ డి ఉండడం వలన పీరియడ్ క్రామ్ప్స్ తగ్గించడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్క:  దీనిలో యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు అధికంగా ఉంటాయి.

హెవీ బ్లీడింగ్, వాంతులు, వికారం లాంటి సమస్యలను దూరం చేయడానికి  ఇది బాగా మేలు చేస్తుంది.

కాబట్టి పీరియడ్స్ సమయంలో పెయిన్స్ తో బాధపడే వారు దాల్చిన చెక్ టీ తాగడం మంచిది.

నిమ్మకాయ:  దీనిలో విటమిన్ సి అధికంగా లభిస్తుందన్న సంగతి తెలిసిందే.

అలాగే నిమ్మకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వలన  కండరాల నొప్పిని తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.

డ్రై ఫ్రూట్స్  :  ఎండు ద్రాక్ష , జీడిపప్పు , బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వలన ఐరన్ బాగా లభిస్తుంది.

అంతే కాకుండా తరచూ వీటిని తీసుకోవడం వలన పీరియడ్ సైకిల్ ను రెగ్యులర్ చేస్తాయి.

అల్లం:  పీరియడ్ టైమ్ లో వచ్చే నొప్పులను తగ్గించడంలో  అల్లం అద్భుతంగా పని చేస్తుంది.

ఆకుకూరలు :  వీటిలో రన్‌, మెగ్నీషియం, కాల్షియం అధికంగా .. జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.

కాబట్టి పీరియడ్ సమయంలో  నొప్పుల నుంచి  ఉపశమనం పొందాలంటే ఈ ఫుడ్స్  తీసుకోవడం మంచిది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం