అతిగా మందులు వాడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే

నేటి సమాజంలో చాలా మందిలో ఏదో ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది

చాలా మంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కాస్తా రెస్ట్ తీసుకుంటారు

మరికొందరు మాత్రం చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా  మందులను వాడుతుంటారు.

కొద్ది పాటి జ్వరం, తలనొప్పి, దగ్గు, మరేదైనా నొప్పి కానీ..వెంటనే ట్యాబెట్లు వాడుతుంటారు.

అలా అతిగా మందులు వాడటంతో చాలా నష్టాలు ఉంటాయని వైద్యలు చెబుతున్నారు.

ప్రతి చిన్న సమస్యకు మందులే పరిష్కారం కాదు

మందులను అతిగా వాడటం వల్ల ఆ సమస్య ఎక్కువ కావడంతో పాటు ప్రాణపాయం కావచ్చు

అనారోగ్య సమస్య దేనివల్ల వచ్చిదో తెలుసుకోకుండా మందులు వాడకూడదు

అలా వాడటం వలన  సమస్య తీరకపోగా..మరింత తీవ్రంగా మారవచ్చు.

ఎక్కువ ట్యాబ్లెట్లు వాడటం వలన కిడ్నీలపై ప్రభావం పడుతుంది.

వయస్సు పెరిగే కొద్ది వేసుకునే  మందుల వల్ల కిడ్నీల జీవితకాలం తగ్గిపోతుంది.

వైద్యులు ఇచ్చిన మాత్రలే అయినా పలు రకాల్ని ఒక్కేసారే వేసుకోరాదు.

కొన్ని సార్లు ట్యాబ్లెట్లలోని కెమికల్స్ ఒకదానికొక్కటి సరిపోకపోవచ్చు.

అతిగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం