మన హీరోలు చేస్తున్న సామాజిక సేవ!

చిరంజీవి:

రక్తదానం, నేత్రదానం అవసరాన్ని గుర్తించి ఆయన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించారు.

రజినీకాంత్:

ఆరోగ్య సంరక్షణ, చదువు కోసం.. అలానే ప్రకృతి విపత్తుల సమయంలో భారీగా విరాళం అందించారు.

ధనుష్:

ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు చదువు, ఆరోగ్యం అందించడం కోసం సేవ చేస్తున్న పలు ఛారిటీలకు భారీగా విరాళాలు అందించారు.

అల్లు అర్జున్:

క్యాన్సర్ రోగులకు భారీగా విరాళం అందించడమే కాకుండా చదువును ప్రోత్సహిస్తున్నారు.

రామ్ చరణ్:

మెడికల్ క్యాంప్స్ కోసం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకొచ్చి సాయం చేసేవారికి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు.

మహేష్ బాబు:

చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్స చేయించడమే కాకుండా రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు.  

విజయ్:

చదువు కోసం, ప్రకృతి వైపరీత్యాలకు గురైన కుటుంబాలకు భారీగా విరాళం అందించారు.

యష్:

కరువుతో పీడింపబడుతున్న ప్రజలకు భారీగా విరాళాలు ఇచ్చారు. అంతేకాకుండా కర్ణాటకలో ఆర్థికంగా వెనుకబడిన పిల్లల చదువు కోసం సపోర్ట్ గా నిలిచారు.

మోహన్ లాల్:

డిసాస్టర్ రిలీఫ్, హెల్త్ కేర్, సంక్షేమం వంటి వాటికి సపోర్ట్ చేస్తూ ఉంటారు.

నాగార్జున:

అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా చదువు, ఆరోగ్యం, సంక్షేమానికి భారీగా విరాళాలు ఇస్తుంటారు.