వేడి నీటి స్నానం vs చన్నీటి స్నానం.. రెండింట్లో ఏది బెస్ట్? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

iDreampost.Com

స్నానం విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తే.. మరికొందరు చన్నీటితో ఫ్రెషప్ అయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు.

iDreampost.Com

గీజర్లు తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలా మంది వేడి నీటి స్నానాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇంకా చన్నీళ్లతో స్నానం చేసేవారూ ఉన్నారు.

iDreampost.Com

కరోనా తర్వాత అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఫిట్ గా ఉండేందుకు భోజనం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. 

iDreampost.Com

వేడి నీరు, చన్నీళ్లలో ఏది బెస్ట్? దేంతో స్నానం చేయాలనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం ప్రకారం వీటిల్లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

iDreampost.Com

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నరాల చివరలు ప్రేరేపించబడటమే గాక పొద్దున్నే శరీరం శక్తిని పొందుతుంది.

iDreampost.Com

బద్దకం నుంచి బయటపడటానికి ఇది దోహదపడుతుంది.

iDreampost.Com

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంలో చన్నీటి స్నానం ఎంతో ఉపయోగపడుతుంది.

iDreampost.Com

ఊపిరితిత్తుల పనితీరు, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.

iDreampost.Com

వేడి నీటి స్నానం వల్ల శరీరం శుభ్రపడటమే గాక పేరుకుపోయిన సూక్ష్మక్రిములు చనిపోతాయి.

iDreampost.Com

మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో, కండరాల పట్టును మెరుగుపర్చడంలో వేడి నీటి స్నానం దోహదపడుతుంది.

iDreampost.Com

ఆవిరి శ్వాసనాళాలను క్లియర్ చేయడానికి ఈ స్నానం బెటర్.

iDreampost.Com

గొంతు, మూసుకుపోయిన ముక్కును తెరవడానికి వేడి నీళ్ల స్నానం ఉపయోగపడుతుంది.

iDreampost.Com

ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే.. శరీరానికి గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం ఉత్తమం.

iDreampost.Com

ల స్నానం చేసేవారు చన్నీటిని ఉపయోగించడం మేలు అని ఆయుర్వేదం చెబుతోంది.

iDreampost.Com

కళ్లు, జట్టును వేడి నీటితో కడగడం మంచిది కాదు. అందుకే చన్నీటిని ఉపయోగించాలి.

iDreampost.Com

 వయసు ఆధారంగా స్నానం చేసే నీటిని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యువకులు చన్నీటితో స్నానం చేయడం బెస్ట్ అని అంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం