గ్రీన్‌ టీని మించి మేలు చేసే ఉల్లి టీ! ఒక్కసారి తాగితే..

మన ఆరోగ్యంలో ఉల్లి అనేది కీలక పాత్ర పోషిస్తుంది.

ఉల్లి టీ అనగానే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కదూ..?

ఇక ఉల్లి అనగానే అనేక రకాల వంటలు గుర్తుకు వస్తాయి.

ఉల్లిపాయ పకోడి, ఫ్రైడ్ ఆనియ్సన్స్స రైతా, భిండీ దో ప్యాజా లాంటి వంటకాలు గుర్తుకు వస్తాయి.

అంతేకాక కూరల్లో సైతం ఉల్లిని తప్పని సరిగా ఉపయోగిస్తుంటారు.

ఇక ఉల్లితో టీ చేయోచ్చని తెలుసా?. అంతేకాక ఈ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఉల్లి టీ తాగడం వల్ల బీపీని  అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు

రోజు ఓ కప్పు ఉల్లి టీ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

అలానే ఉల్లి టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

ఉల్లి టీ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి బాగా సహయం చేస్తుంది.

 జలుబు, దగ్గు, గొంతు మంట, ముక్కు కారడం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

అలానే పచ్చి ఉల్లిపాయ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంలో సాయం చేస్తుంది.

స్టమక్ కాన్సర్, కొలొరెక్టల్ కాన్సర్లని ప్రివెంట్ చేయడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇలా ఉల్లి, ఉల్లిటీతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం