ఈ సీజన్ లో ముఖ్యంగా బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు.. 

బొప్పాయిని మీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

దీనిలో అధికంగా A, C, E విటమిన్లు ఉన్నాయి. 

ఇవి చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కణాల రక్షణకు ఉపయోగపడతాయి. 

బొప్పాయి ప్రతి సీజన్‌లో  లభిస్తుంది. కానీ,  శీతాకాలంలో దీన్ని తినడం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 

బొప్పాయిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు  ఉన్నాయి.

ఇవి రక్తంలో చక్కెర స్థాయిని  నియంత్రించడంలో సహాయపడతాయి.

మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా  ఉంటాయి. 

పైగా బొప్పాయి డైటరీ ఫైబర్‌తో కూడిన తక్కువ కేలరీలు కలిగిన పండు. 

కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 

ఇంకా ఇది జీర్ణ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.