Tooltip

 రాత్రి సమయంలో  నిద్ర పట్టడం లేదా !అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..

Tooltip

ఈరోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడి కారణంగా నిద్రకు దూరం అవుతున్నారు.

Tooltip

ముఖ్యంగా యూత్ సెల్ ఫోన్స్ చూస్తూ..  సరైన నిద్ర పోవడం లేదు. 

Tooltip

దీని కారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. 

Tooltip

రాత్రులు సరిగా నిద్ర పట్టకపోవడానికి శరీరంలో విటమిన్ల లోపం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. 

Tooltip

శరీరంలో విటమిన్ సి కనుక తక్కువగా ఉంటే రాత్రుళ్ళు సరిగా నిద్రపట్టదట.

Tooltip

విటమిన్‌ సీ యాంటీఆక్సిడెంట్ పవర్‌హౌస్.. ఇది శరీరంలో ఇమ్మ్యూనిటీని పెంచుతుంది.

Tooltip

కాబట్టి నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు.. వారి డైట్‌లో బ్రోకలీ, పాలకూర, కివీ, స్ట్రాబెర్రీ చేర్చుకుంటే మంచిది.

Tooltip

విటమిన్ ఈ .. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది. 

Tooltip

గుమ్మడి గింజలు, సోయాబీన్‌ నూనె, బాదం, వేరుశనగలాంటి గింజపప్పుల్లో, పాలకూరలో విటమిన్ ఈ లభిస్తుంది.

Tooltip

కాబట్టి నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు ఈ ఆహార పదార్ధాలను వారి డైట్ లో యాడ్ చేసుకోవాలి. 

Tooltip

విటమిన్ B6 సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Tooltip

ఒక వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోవాలంటే .. ఈ రెండు హార్మోన్లూ ఎంతో అవసరం.

Tooltip

అరటిపండ్లు, డైరీ ఉత్పత్తులు, గుడ్లు, ఆకుకూరలలో విటమిన్ B6 లభిస్తుంది. 

Tooltip

కాబట్టి నిద్రలేమి సమస్యతో  బాధపడే వారు ఈ ఆహార పదార్ధాలను వారి డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం