‘హిట్ అండ్ రన్’  కేసుల్లో కొత్త రూల్స్..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.

భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అనేది రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.

ఈ రోడ్డు ప్రమాదాలు ఒకరిద్దరినే కాదూ కుటుంబాన్నే బలి తీసుకుంటున్నాయి

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే చాలా మంది డ్రైవర్లు అక్కడ వదిలేసి పారిపోతుంటారు. 

దీన్నే హిట్ అండ్ రన్ కేసుగా పరిగణిస్తారు పోలీసులు. ఈ హిట్  అండ్ రన్ కేసుకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి.

ఈ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సహితం అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ చట్టం ప్రకారం..డ్రైవర్లు యాక్సిడెంట్ చేసి పారిపోకూడదు, ఘటన సమచారాన్ని పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిందే.

ఈ కేసులో దోషులుగా తేలితే రూ. 7 లక్షల జరిమానాతో పాటు 10  ఏళ్లు జైలు శిక్ష పడనుంది. 

ఈ  కొత్త చట్టంపై వాహనాల డ్రైవర్లు మండిపడుతున్నారు. 

కొత్త చట్టంలోని కఠినమైన నిబంధనలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. నిరసనకు దిగారు. 

కొన్ని సార్లు ఏదో పొరపాటున  జరిగే ప్రమాదాలకు కూడా ఈ చట్టం కారణం తాము బలి అవుతామని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హిట్ అండ్ రన్ కేసు కొత్త చట్టంలోని నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే డ్రైవర్లు వాహనాలను నిలిపివేసి సమ్మె చేస్తున్నారు

ఈ సమ్మె వల్ల రానున్న రోజుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలవగచ్చునని వాహనదారులు బంకు వద్దకు క్యూ కట్టారు.