వర్షా కాలంలో వేపాకుతో ఇలా చేయండి! 100 ఫెయిర్ అండ్ లవ్లీలతో సమానం!

వేప.. మనుషులకు అన్నీ విధాలా మంచిని చేసే చెట్టు

ముఖ్యంగా చర్మ వ్యాధులను తగ్గించడంలో దీనికి తిరుగులేదు

అయితే.., మిగతా అన్నీ సీజన్స్ కన్నా.. వర్షా కాలంలో వేపాకు రెమిడీ బాగా పని చేస్తుంది

వర్షా  కాలంలో ఎలాగో వేడి నీటితోనే  స్నానం చేస్తాము కదా?

ఆ నీటిలో ఒక 10 నుండి 15 వేపాకులు వేసి మరిగించి.. స్నానం చేస్తే బెటర్

వేపాకు హానికరమైన బ్యాక్టీరియాను సులభంగా నాశనం చేయగలదు

ఇక వేపాకు, పసుపు, నిమ్మ, పెరుగు కలిపిన మిశ్రమాన్ని రోజూ రాసుకుంటే శరీరం కాంతివంతం అవుతుంది

శరీరంలో ఎక్కడైనా గాయాలు ఉన్నా ఈ మిశ్రమాన్ని అప్లై చేసినా ఉపశమనం ఉంటుంది

కాలి గోర్లలో ఉండిపోయే బ్యాక్టీరియాని త్వరగా నాశనం చేయడానికి కూడా వేపాకు మిశ్రమం ఉపయోగపడుతుంది

వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్  లక్షణాల కారణంగా వేపాకు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది

ఇక మనలో చాలా మంది వేపాకుని అతిగా తింటూ ఉంటారు. అది డేంజర్

యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు మాత్రం లేత వేపాకుని తగిన మొత్తంలో తీసుకోవడం మంచిది

దంత సమస్యలు ఉన్నవారు.. ఎక్కువ రోజులు  వేప పుల్లతో దంతధావనం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం