పురాతన మనుషులు చేసిన మిస్టరీ ప్లేసెస్

ఈ భూమ్మీద ప్రాచీన మనుషులు చేసిన ఎన్నో గొప్ప గొప్ప అంతుచిక్కని కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేకున్నా ఎలా కట్టారో అనేది మిస్టరీనే.

ప్రాచీన నాజ్కా ప్రజలు అతి పెద్ద జియోగ్లిఫ్స్ ని ఎలాంటి ఏరియల్ వ్యూస్ లేకుండా ఖచ్చితంగా క్రియేట్ చేయడం అనేది ఇప్పటికీ మిస్టరీనే.

నాజ్కా లైన్స్, పెరూ దేశం:

యూకేలో ఉన్న స్టోన్హెంజ్ కోసం మైళ్ళ దూరంలో ఉన్న క్వారీల నుంచి రాళ్లను మోసుకొచ్చి మరీ ఇలా పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారో? ఎలా రాళ్లను మోసుకొచ్చారో అనేది ఇప్పటికీ మిస్టరీనే.

స్టోన్హెంజ్, యూకే దేశం:

రాయడానికి అప్పటి వారికి భాష అనేది తెలియకున్నా, అధునాతన లోహశాస్త్రం లేకున్నా అతి క్లిష్టమైన బండరాయిని అంత ఖచ్చితంగా రాతి పనిముట్లతో చెక్కడం అప్పటి ప్రజలకు ఎలా సాధ్యపడిందో అంతు చిక్కనిది.   

పమ పంకు, బొలీవియా దేశం:

7100-5700 సామాన్య శక పూర్వం ముందు అంటే అప్పటికి వ్యవసాయం, రాయడం, చక్రాలు,లోహాలు ఏమీ లేని సమయంలో ఈ పురాతన కట్టడం ఎలా సాధ్యపడిందో అనేది మిస్టరీ.  

ఛాతోల్ హుయక్, టర్కీ దేశం:

పారాకాస్ కాండెలాబ్రా అనేది సముద్రంలో చాలా దూరం నుంచి కనిపిస్తుంది. కానీ దీని ప్రయోజనం ఏంటో ఇప్పటికీ మిస్టరీనే.     

పారాకాస్ కాండెలాబ్రా, పెరూ దేశం:

ఇక్కడ కత్తిరించిన రాళ్లు పేర్చి ఉంటాయి. ఎలాంటి సిమెంట్ లాంటి పదార్థం లేకుండా ఒకదాని మీద ఒకటి పేర్చారు. కొన్ని బ్లాక్స్ అయితే 100 టన్నుల బరువు ఉంటాయి.    

సక్సయ్ వోమన్, పెరూ దేశం:

అయితే ఇంత అతి పెద్ద రాళ్లను కత్తిరించి కఠినమైన భూభాగం మీద రవాణా చేయడానికి అప్పటికి అంత సాంకేతికత లేదు. కానీ ఎలా సాధ్యమో ఇప్పటికీ మిస్టరీనే.

ఇది 9600 సామాన్య శకపూర్వం నాటిది. అయితే ఇంత అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ ని ఎందుకు, ఎలా నిర్మించారో మిస్టరీగానే ఉంది.

గొబెక్లీ టాపే, టర్కీ దేశం:

షాంక్ కోయింగ్ పీఠభూమిలో పెద్ద పెద్ద రాతి జాడీలు చెల్లాచెదురుగా ఉన్నాయి. వీటి మూలాలు గానీ.. సృష్టించింది ఎవరో అనేది తెలియదు.

ప్లెయిన్ ఆఫ్ జార్స్, లావోస్ దేశం