జీవితంలో ఒక్కసారైనా  ఈ రూట్స్ లో ట్రైన్ జర్నీ చేయాలి!

జీవితంలో ఒక్కసారైనా ఈ రూట్స్ లో ట్రైన్ జర్నీ చేయాలి!

ఎన్ని రోజులు పని చేసినా.. ఎంత కష్టపడినా మనిషికి కాస్త ఆటవిడుపు ఉండాలి.

అందుకే చాలామంది వెకేషన్ కి వెళ్తూ ఉంటారు.

అయితే వెకేషన్ అంటే ఒక మంచి ఊరు, ప్రాంతానికి వెళ్తారు.

అక్కడకు విమానం, ట్రైన్, బస్సుల్లో ప్రయాణం చేస్తారు.

అయితే మీరు ఈ రూట్లలో ట్రైన్ లో వెళ్తే అది విహారయాత్ర ఫీల్ ఇస్తుంది.

కల్కా- షిమ్లా: ఈ 96 కిలోమీటర్ల జర్నీలో 102 టన్నెల్స్, 82 బ్రిడ్జులు ఉంటాయి.

న్యూ జల్పాయిగురి- డార్జిలింగ్.. 78 కి.మీ. ఈ రూట్లో ఫేమస్ బటాసియా లూప్ సహా.. ఎత్తైన్ కొండలు- అద్భుతమైన ప్రకృతిని చూడచ్చు.

మహారాజా ఎక్స్ ప్రెస్ ఢిల్లీ- ముంబయి: ఈ లగ్జరీ ట్రైన్ 7 రోజుల్లో 5 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. ఇందులో విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి.

వాస్కోడీగామా రూట్ హుబ్లి- మాడ్గావ్: దుదాసాగర్ వాటర్ ఫాల్స్. ఈ జలపాతం చూడాలి అంటే లోండా జంక్షన్ లో దిగచ్చు.

డెక్కన్ ఒడిస్సీ.. ముంబయి- ఢిల్లీ: ఈ లగ్జరీ ట్రైన్ మహారాష్ట్ర- గోవాలను కవర్ చేస్తుంది. ఆయుర్వేదిక్ స్పా- స్టీమ్ బాత్ ట్రైన్ లోనే ఉంటాయి.

సేతు ఎక్స్ ప్రెస్.. చెన్నై- రామేశ్వరం: ఈ ట్రైన్ లో వెళ్తే మీరు 1988లో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని చూడచ్చు.

జమ్ము- ఉధంపూర్: ఈ రూట్లో 20 టన్నెల్స్, 158 బ్రిడ్జులు ఉంటాయి. నదులు సహా కశ్మీర్ వ్యాలీ అందాలు ఆశ్వాదించవచ్చు.

ఐల్యాండ్ ఎక్స్ ప్రెస్.. కన్యాకుమారి- త్రివేంద్రం: ఈ రూట్లో మీరు 2 గంటల జర్నీలో ప్రకృతి రమణీయతను ఆశ్వాదించవచ్చు.

గోల్డెన్ ఛారియట్.. బెంగళూరు- గోవా: హంపీ, బదామీ, గోవాలో ఆగుతుంది. ఈ జర్నీలో మీరు ఇసుక రాతి గుహలు, టెంపుల్స్, అటవీ ప్రాంతాలు చూడచ్చు.