'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమా రివ్యూ!

విలన్, కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అజయ్ ఘోష్.

50 ఏళ్ల వయసున్న వ్యక్తి డీజేగా మారాలి అనుకున్న కథాంశంతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?

మ్యూజిక్ షాప్ నడుపుకొనే వ్యక్తిగా అజయ్ ఘోష్ నటించాడు.

డీజే కావాలని అష్టకష్టాలు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే చాందినీ చౌదరి అతడికి పరిచయం అవుతుంది.

ఆమెకు కూడా డీజే కావాలని తండ్రితో గొడవ పడుతూ ఉంటుంది.

వీరిద్దరు కలిసి డీజే అవ్వడం కోసం పడ్డ కష్టాలను తెరపై అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.

అజయ్ ఘోష్, చాందినీ కలిసి ఊళ్లో తిరుగుతుంటే చూసే వారందరూ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు.

ఇలాంటి వారికి వారు ఏం సమాధానం చెప్పారు? చివరికి వాళ్లిద్దరు డీజేలుగా మారారా? అన్నదే మిగతా కథ.

తొలి చిత్రంతోనే డైరెక్టర్ శివ సక్సెస్ కొట్టాడని చెప్పొచ్చు. అజయ్ ఘోష్, చాందినీల నటన అభిమానులను మెప్పిస్తుంది.