'OTTలోకి వచ్చేసిన హాయ్ నాన్న.. స్ట్రీమింగ్ ఎక్కడంటే'

"

"

న్యాచురల్‌ స్టార్‌ నానీ-మృణాల్‌ ఠాకూర్‌ జంటగా ‘హాయ్‌ నాన్న’ సినిమా వచ్చింది.

"

"

డిసెంబర్‌ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

"

"

ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లు కూడా హాయ్‌ నాన్నకు మంచి రివ్యూలు ఇచ్చారు.

"

"

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

"

"

జనవరి 4 అనగా గురువారం అర్థ రాత్రి నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంది.

"

"

నెట్‌ఫ్లిక్స్‌ హాయ్‌ నాన్న ఓటీటీ హక్కుల్ని భారీ మొత్తానికే కొన్నట్లు సమాచారం.

"

"

కొత్త దర్శకుడు శౌర్యవ్‌ ఎంతో నేర్పుగా ఈ సినిమాను తెరకెక్కించారు.

"

"

స్క్రీన్‌ ప్లే విషయంలో శౌర్యవ్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే.

"

"

ఈ సినిమా పాటలు మంచి విజయం సాధించాయి. 

"

"

సినిమా కథ విషయానికి వస్తే.. విరాజ్‌ (నాని) ఓ గొప్ప ఫొటోగ్రాఫర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు.

"

"

ఓ రోజు రైల్వే స్టేషన్‌లో విరాజ్‌కు యశ్న( మృణాల్‌ ఠాకూర్‌) కనిపిస్తుంది. వెంటనే లవ్ లో పడతాడు.

"

"

ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం లేని ఆమె విరాజ్‌కు మొదట నో చెప్పినా.. తర్వాత అంగీకరిస్తుంది.

"

"

అతి కష్టంగా యశ్న ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా వీరి పెళ్లి జరుగుతుంది.

"

"

పిల్లలు కనే విషయంలోనూ ఇద్దరికీ గొడవలు అవుతాయి. 

"

"

ఓ పాప పుట్టిన తర్వాత వారి జీవితంలో ఏం చోటుచేసుకుంది అన్నదే మిగిలిన కథ.