దేశంలోనే మోస్ట్ డేంజరస్ రోడ్లు! దయ్యాలు తిరుగుతాయని అంటారు

కాషేడి ఘాట్ రోడ్: ఇది అతి భయంకరమైన రోడ్డు అని చెప్తారు. ఎవరైనా ఈ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారి దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్ ఉండకూడదట.

కాషేడి ఘాట్ రోడ్: నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటే రక్తం తాగే మంత్రగత్తెలు వచ్చి వాటిని పట్టుకెళ్ళిపోతాయట. ఆకలి ఎక్కువగా ఉంటే అక్కడున్న మనుషులని తినేస్తాయట. ముంబై-గోవా హైవేలో ఉంది ఈ ఘాట్ రోడ్డు. 

భాంగర్ కోట: దేశంలో ఉన్న హాంటెడ్ ప్లేసెస్ లో ఇదొకటి. ఢిల్లీ-జైపూర్ హైవే మీద ఉంది. ఈ రోడ్డు మీద ప్రయాణించిన వాళ్ళకి కీడు జరుగుతుందని.. ఏదో దుష్ట శక్తి ఆపుతుందని చాలా మంది చెప్పారు.

ఢిల్లీ కంటోన్మెంట్: మోస్ట్ డేంజరస్ ప్లేసుల్లో ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డు ఒకటని చెప్తారు. రాత్రి మెరుస్తున్న తెల్లని చీరలో ఒక లేడీ కళ్ళు పొడిచి వెళ్ళిపోతుందని అంటారు.

ఢిల్లీ కంటోన్మెంట్: ఇక్కడ ఆ లేడీ కారుతో పాటు సమానంగా వేగంగా పరిగెడుతుందని చెబుతారు. రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ అడుగుతుందని అంటారు.

బ్లూ క్రాస్ రోడ్డు: భయానక రోడ్లలో బ్లూ క్రాస్ రోడ్డు ఒకటి. ఇక్కడ అనేక మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. అందుకే ఇటు వైపు వెళ్తే మృత్యువు వెంటాడుతున్న ఫీలింగ్ కలుగుతుందని అంటారు. ఇది చెన్నైలోని బెసెంట్ నగర్ లో కస్టమ్ కాలనీలో ఉంది. ఈ దారిలో వెళ్లడం రిస్క్ అని అంటారు.

సత్యమంగళం వైల్డ్ లైఫ్ సాంక్చురీ కారిడార్: ఇది తమిళనాడులో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గా ఉంది. జాతీయ రహదారి 209 మీద ఉంది. ఇది బందిపోటు వీరప్పన్ హోమ్ అని చెబుతారు. ఇక్కడ ఏళ్లుగా ఏవో అరుపులు వినిపిస్తున్నాయని అంటారు.

మార్వ్ & మద్ ఐలాండ్ రోడ్డు: ఇది ముంబైలోని మార్వ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఒక భర్త తన భార్యను ఒక ట్రక్ కి గుద్దించి చంపేశాడని.. అప్పటి నుంచి ఆ భార్య దయ్యమై తిరుగుతుందని చెబుతారు. పెళ్లికూతురు డ్రెస్ లో తిరుగుతుందని.. పట్టీల సౌండ్ వినిపిస్తుందని అంటారు.       

ద్వార్కా సెక్టార్ 9 మెట్రో స్టేషన్: ఢిల్లీలో ఉన్న ద్వార్కా సెక్టార్ 9 మెట్రో స్టేషన్ రోడ్డు మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని చెబుతారు. అటుగా వెళ్లేవారిని దయ్యం చాలా వైలెంట్ గా కొడుతుందని నమ్ముతారు. చాలా మంది క్యాబ్ డ్రైవర్లు ఈ అనుభవం ఎదురైందని చెబుతారు. 

ద్వార్కా సెక్టార్ 9 మెట్రో స్టేషన్: మెట్రో నిర్మాణంలో ఉండగా ఒక కారు ఢీకొని ఒక చిన్నారి మృతి చెందింది. అప్పటి నుంచి ఒక వృద్ద దయ్యం, ఆ పాప దయ్యంతో ప్రతీకారం కోసం తిరుగుతుందని చాలా మంది అటువైపు వెళ్ళడానికి భయపడతారు.