మార్నింగ్‌ వాక్‌ మంచిదా.. తిన్నాకా నడిస్తే మంచిదా.. డాక్టర్లు ఏమంటున్నారంటే!

iDreampost.Com

ఆరోగ్యానికి నడక చాలా మంచిది అంటారు.

iDreampost.Com

చాలా మందికి ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేసే అలవాటు ఉంటుంది.

iDreampost.Com

ఆరోగ్యంతో పాటు..  బరువు తగ్గడం కోసం కూడా వాకింగ్‌ చేస్తుంటారు.

iDreampost.Com

వాకింగ్‌ వల్ల బరువు తగ్గడం మాత్రమే కాక.. శరీరంలోని విషపదార్థాలు చెమట రూపంలో బయటకు పోవడానికి..

iDreampost.Com

అలానే అనవసర కొవ్వు కరగడానికి, రక్తప్రసరణ మెరుగవడానికి, మైండ్‌ రిలాక్స్‌ కావడానికి సహకరిస్తుందని వైద్యులు అంటున్నారు.

iDreampost.Com

అయితే కొందరు మార్నింగ్‌ వాక్‌ చేస్తే.. మరి కొందరు తిన్నాకా నడుస్తుంటారు.

iDreampost.Com

మరి ఈ రెండింటిలో ఏది మంచిది.. దేని వల్ల అధిక లాభాలున్నాయంటే..

iDreampost.Com

నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేయడం వల్ల  మెటబాలిజం మెరుగవుతుందంటున్నారు వైద్యులు.

iDreampost.Com

మార్నింగ్‌ వాక్‌ వల్ల ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి, బరువు తగ్గవచ్చు, కొవ్వు కరుగుతుంది.

iDreampost.Com

అలానే ఉదయపు ఎండలో నడవడం వల్ల శరీరానికి అవసరమైన డి విటమిన్‌ అందుతుంది.

iDreampost.Com

అదే తిన్న తర్వాత నడిస్తే..

iDreampost.Com

భోజనం చేసిన తర్వాత 100 అడుగులైనా వెయ్యాలని పెద్దలు చెబుతుంటారు.

iDreampost.Com

అలా అని తినగానే నడవకూడదు.

iDreampost.Com

భోజనం చేసిన  5, 10 నిమిషాల తర్వాత వాకింగ్‌ చేయాలి.

iDreampost.Com

ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవ్వడమే కాక.. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా ఉంటాయంటున్నారు.

iDreampost.Com

తిన్నాక నడిస్తే.. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేయడమే కాక.. ఎసిడిటీని తగ్గిస్తుంది.

iDreampost.Com

ఉదయం ఖాళీ కడుపుతో చేసే వాకింగ్‌, భోజనం చేశాక నడక ఈ రెండింటిలో ఏది మంచిది అంటే..

iDreampost.Com

రెండూ మంచివే అంటున్నారు డాక్టర్లు.

iDreampost.Com

మార్నింగ్‌ వాక్‌ వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, శక్తి వస్తాయని చెబుతున్నారు..

iDreampost.Com

భోజనం తర్వాత చేసే వాకింగ్‌ వల్ల రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం