పద్మవిభూషణుడు

మన చిరంజీవి..

White Frame Corner

కొన్ని బిరుదులు కొందరికి విలువను తెచ్చిపెడితే.. కొందరు ఆ బిరుదులకే వన్నె తెచ్చిపెడతారు.

White Frame Corner

అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు

White Frame Corner

చిరుని పద్మవిభూషణ్‌ వరించిందనడం తప్పేమో.. పద్మవిభూషణ్‌ ని చిరంజీవే వరించారు.

White Frame Corner

 ఆయన నట జీవితం వడ్డించిన విస్తరి కాదు.

White Frame Corner

అవకాశాలతో పాటు వచ్చే అవమానాలను ఎదుర్కుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ ఈ స్థాయికి వచ్చారు.

White Frame Corner

ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండడం, క్రమశిక్షణ, కష్టపడేతత్వం.. ఇవన్నీ ఆయనకు ఈ స్థాయిని కట్టబెట్టాయి.

White Frame Corner

24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వారిలో ఖచ్చితంగా చిరు అభిమానులు ఉంటారు.

White Frame Corner

ఆయనను నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా ఆరాధించేవారూ ఉన్నారు. 

White Frame Corner

సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయ్యి జీవిస్తారో.. సమాజం పట్ల కూడా అంతే ఇన్వాల్వ్ అయ్యి జీవిస్తారు.

White Frame Corner

ఆ ఇన్వాల్వ్ మెంట్ నుంచి వచ్చినవే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా సంస్థలు. 

White Frame Corner

కరోనా సమయంలో సినీ కార్మికులు అల్లాడిపోతుంటే.. నేనున్నా అంటూ ముందుకొచ్చారు.

White Frame Corner

ఎవరు ఎన్ని అన్నా నవ్వుతూ ఉండడం.. శత్రువుని సైతం ప్రేమించడం.. భోళాతనం, అణకువ, అంకితభావం, కష్టపడేతత్వం.. ఇవి కదా శివశంకర్ వరప్రసాద్ ని మెగాస్టార్ చిరంజీవిని చేశాయి.

White Frame Corner

మనకి తెలిసినవి గోరంత.. చిరు గురించి తెలియనవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉంటాయి.

White Frame Corner

ఆయన జీవన పరిభ్రమణంలో గుప్తదానాలు, గురితప్పని వాగ్దానాలు కోకొల్లలు.  

White Frame Corner

అందుకే ఈరోజున మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ అనే బిరుదు వరించింది.

White Frame Corner

నిజానికి పద్మవిభూషణ్ ఆయనను వరించడం కాదు.. ఆయనే పద్మవిభూషణ్ ని వరించారేమో అనాలి. ఇది తెలుగువారు గర్వించాల్సిన విషయం.