గుంటూరు కారం సినిమా రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడో సినిమాగా గుంటూరు కారం

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకి వచ్చిన గుంటూరు కారం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం

ముందుగా కథ విషయానికి వస్తే.. వైరా వెంకట సూర్యనారాయణ(ప్రకాష్ రాజ్) జనదళం పార్టీ అధినేత

అతని కుమార్తె వసుంధర(రమ్యకృష్ణ) న్యాయ శాఖా మంత్రిగా బాధ్యత చేపడుతుంది. 

ఆమె తన పెద్ద కొడుకు రమణ(మహేష్ బాబు)ని చిన్న వయసులోనే వదిలేసి.. అతనికి దూరంగా జీవిస్తూ ఉంటుంది

వెంకట సూర్యనారాయణ ఫ్యామిలీకి పాతికేళ్ల తరువాత రమణతో  అవసరం ఏర్పడుతుంది.

రమణగాడు  ఆ కుటుంబ అవసరం తీర్చాడా? లేదా? అన్నదే గుంటూరు కారం కథ.

మహేశ్ బాబు మాస్ సినిమాలు చేస్తే.. ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ అయిన సందర్భాలు ఉన్నాయి.  

గుంటూరు కారం సినిమాలో మాత్రం ఆ రేంజ్ మాస్ సీన్స్ లేవు. 

సినిమా ఆసాంతం నీరసంగా టీవీ సీరియల్ లా తయారైంది. 

కథ ముందుకి నడవకుండా.. గురూజీ పొంతన లేని, అతకని సీక్వెన్స్ లతో, నీరసం తెప్పించేశాడు. 

తన ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా తాను ఓ పక్కా మాస్ మసాలా సినిమాలో నటిస్తున్నాను అన్న నమ్మకంతో ప్రాణం పెట్టి నటించేశాడు మహేశ్

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీలో ఈసారి ఎందుకో ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. 

థమన్ బీజీఎమ్ మాత్రం అదరగొట్టాడు. కానీ..,కథ బాగాలేక అది కూడా అంతగా హైలెట్ కాలేదు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారం విషయంలో ఆయన రచయితగా విఫలం అయ్యారు. 

ప్లస్లు : రమణ క్యారెక్టరైజేషన్ మహేశ్ బాబు నటన, ఎనర్జీ, లుక్ శ్రీలీల అందం , డ్యాన్స్ వెన్నల కిషోర్

మైనస్ లు: కథ, కథనం ఎమోషన్స్ పండకపోవడం త్రివిక్రమ్ మార్క్ మిస్ అవ్వడం ఎడిటింగ్

చివరి మాట:  గుంటూరు కారం.. ఘాటు తగ్గింది

రేటింగ్ : 2.5