మహారాజా మూవీ రివ్యూ

తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యాక్టింగ్‌ గురించి చెప్పాల్సిన పని లేదు.

అతడి కెరీర్‌లో 50వ సినిమాగా తెరకెక్కిన మహారాజ నేడు రిలీజ్‌ అయ్యింది.

మరి మహారాజ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహారాజ భార్య చనిపోవడంతో కుమార్తెతో సెలూన్‌ షాప్‌ నడుపుకుంటూ ఉంటాడు.

ఓ రోజు పోలీసులు దగ్గరకు వెళ్లి తన లక్ష్మి పోయిందని కంప్లైంట్‌ ఇస్తాడు.

లక్ష్మి అంటే ఓ చెత్తబుట్ట. దాంతో పోలీసులు అతడిని తిడతారు.

మహారాజ మాత్రం తన లక్ష్మిని వెతికి ఇస్తేనే అక్కడ నుంచి కదులుతాను అంటాడు.

మరో పక్క సెల్వం(దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌) దొంగతనాలు చేస్తుంటాడు. 

ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ సెకండాఫ్‌ మీద ఆసక్తిని పెంచుతుంది.

స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకోవడంతో సెకండాఫ్‌ స్టార్టింగ్‌లోనే కథ అర్థమైపోతుంది. 

ఇక సెకండాఫ్‌లో ట్విస్టులు రివీల్ చేస్తూ వస్తుండటంతో మధ్యలోనే క్లైమాక్స్ ఊహించొచ్చు. 

ఇక సెల్వంకు, మహారాజకు సంబంధం ఏంటి అనేది తెర మీద చూడాలి.

సాధారణ కథను మంచి స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు.

మొత్తానికి మహారాజ సినిమాను ఫ్యామిలతో కలిసి చూడవచ్చు.