లవ్‌ మౌళి  మూవీ  రివ్యూ

నవదీప్.. టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అవసరం లేని పేరు

లవ్‌ మౌళి చిత్రంతో  హీరోగా నవదీప్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు

ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం

మౌళి (నవదీప్) అనాథ. ప్రేమపై అభిప్రాయం విషయంలో అఘోరాతో గొడవ పడతాడు.

ఆ అఘోరా ఇచ్చిన పెయింట్ బ్రష్‌ తో మౌళి ఏ అమ్మాయి బొమ్మ గీస్తాడో.. తాను నిజంగా అతని ముందుకి వచ్చేసుద్ది

కొన్ని రోజులకి ఆ అమ్మాయితో కూడా మౌళికి గొడవ అవుద్ది

మరోసారి మరో బొమ్మ గీయగా.. అదే అమ్మాయి డిఫరెంట్‌ పర్సనాలిటీతో వస్తుంది.

ఇలా ఎందుకు జరుగుతుంది? మౌళి అసలు నిజమైన ప్రేమ గురించి  తెలుసుకోగలిగాడా? లేదా? అన్నదే ఈ చిత్ర కథ.

‘లవ్ మౌళి’ రెగ్యూలర్ లవ్ స్టోరీ. దీనికి ఓ ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ కావడంతో.. న్యూ టచ్ వచ్చింది

ఫస్టాఫ్‌ లో కాస్త నెరేషన్ స్లోగా ఉండటంతో ల్యాగ్ వచ్చిన ఫీల్ కలుగుతుంది

సెకండాఫ్ మాత్రం బాగుంది.  

లవ్‌ మౌళి కోసం నవదీప్‌ కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చేశాడు.  

హీరోయిన్ పంఖురి గిద్వాని సూపర్‌గా  అనిపించుకుంది.

ఇక అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన  రానా దగ్గుబాటి అదరగొట్టేసాడు.

టెక్నికల్ గా లవ్‌ మౌళి అన్నీ విభాగాల్లో బాగుంది.

లవ్‌ మౌళి కొందరికి మాత్రమే కనెక్ట్‌ అయ్యే లవ్‌ స్టోరి.