ఛాతిలో మంటని అజాగ్రత్త చేయొద్దు.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

చాలామందికి ఛాతిలో మంట లేదా గుండెల్లో మంటగా ఉంటుంది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఛాతిలో మంట ఒక పట్టాన తగ్గదు

అలాగని ప్రతిసారి క్విక్ రిలీఫ్ ఇచ్చే మందులు వాడలేం. దాని వల్ల కొత్త సమస్యలు రావొచ్చు.

అలాగని ఛాతి లేదా గుండెల్లో మంటను తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండకూడదు.

కడుపులోని అధిక ఆమ్లాలు అన్న వాహికలోకి రావడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతుంది.

ఆమ్లాల అధిక ఉత్పత్తిని అరికట్టేందుకు జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచిది.

ఊబకాయం వల్ల కూడా ఆమ్లాలు ఇలా జరగచ్చు. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

మీ ఆహారం మీద మీకు కంట్రోల్ ఉండాలి. అతిగా తింటే ఈ ఇబ్బంది మరింత పెరుగుతుంది.

రాత్రిపూట తినగానే పడుకోవద్దు.. తిన్న తర్వాత కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

అలాగని అర్ధాకలితో ఉండమని కాదు.. తక్కువ భోజనం ఎక్కుసార్లు తీసుకుంటే మంచిది.

వేపుడ్లు, కారం ఎక్కువగా తినద్దు. ఈ లక్షణాలను మరింత పెంచే ఆస్కారం ఉంటుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యం. లేదంటే ఈ సమస్య మరింత పెరగచ్చు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఈ సమస్యను తగ్గించే ఆస్కారం ఉంటుంది.

అయితే సమస్య మరింత జటిలం కాకముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపశమనం కలగకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.