లేడీస్ వాడే ఫెయిర్‌నెస్ క్రీమ్‌తో కిడ్నీ సమస్యలు

అందం కోసం చాలా మంది ఫెయిర్నెస్ క్రీములు వాడతారు. ముఖ్యంగా ఆడవాళ్లు. అయితే ఫెయిర్నెస్ క్రీములు వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

చర్మం కాంతివంతంగా మెరిసేందుకు వాడే స్కిన్ ఫెయిర్నెస్ క్రీములు కిడ్నీ సమస్యలకు దారి తీస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.

ఈ క్రీములు కిడ్నీ ఫిల్టర్స్ ని దెబ్బ తీస్తాయని. ప్రోటీన్ లీకేజ్ కి కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ ఫెయిర్నెస్ క్రీముల్లో అధిక మొత్తంలో పాదరసం ఉంటుందని.. ఇది కిడ్నీ సమస్యలను పెంచడానికి కారణమవుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.   

క్రీముల్లో ఉండే పాదరసం.. చర్మం ద్వారా శరీరం లోపలకు ప్రవేశించి కిడ్నీ ఫిల్టర్స్ పై ప్రభావం చూపిస్తుంది.

ఈ పాదరసం వల్ల నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ క్రీములు వాడిన వారి మీద పరిశోధనలు చేయగా.. వారు అలసట, మూత్రంలో నురుగు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. కొందరికి మెదడులో రక్తం గడ్డకట్టే సమస్య వచ్చింది.

పాదరసం ఎక్కువగా ఉండే ఫెయిర్నెస్ క్రీములు, యాంటి సెప్టిక్ సబ్బులు, లోషన్లను వాడకూడదని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది.   

ఇలాంటి క్రీములను, లోషన్లను వాడడం వల్ల చర్మ వ్యాధులు, మతిమరపు, ఆందోళన, నిరాశ, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించండి.