మహిళలు ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు లేట్ చేయకండి! యమ డేంజర్..

మహిళలు ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు లేట్ చేయకండి! యమ డేంజర్..

క్యాన్సర్.. ఈ పేరు చెప్పగానే ప్రతీ ఒక్కరు వణికిపోతారు.

అయితే మహిళలకు వచ్చే ఓ నిర్ధిష్టమైన క్యాన్సరే అండాశయ క్యాన్సర్. 

ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు ఈ అండాశయ క్యాన్సర్ బారినపడుతున్నారు.

అయితే ఈ వ్యాధిని కొన్ని లక్షణాలు బట్టి ముందుగానే పసిగట్టి.. చికిత్స తీసుకోవడం ద్వారా నయం చేయవచ్చని వైద్యులు తెలుపుతున్నారు.

అండాశయ క్యాన్సర్ ను గుర్తించే 5 లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొత్తికడుపు కింద నిరంతరం నొప్పి, కడుపులో వాపు లేదా భోజనం తర్వాత లేదా పీరియడ్స్ టైమ్ లో నొప్పి వస్తే.. మీరు సందేహించాల్సిందే.

ఆకలి లేకపోవడం, కొంచెం తిన్నాగానీ త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తే.. ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించండి.

రాత్రి సమయంలో అతిగా మూత్ర విసర్జన చేస్తుంటే.. అది ఈ వ్యాధి లక్షణంగా  పరిగణించవచ్చు.

మలబద్దకం లేదా అతిసారం ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా ప్రారంభం అవుతుంది.

మీకు పీరియడ్స్ మధ్య లేదా మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం ఉంటే ఇది అండాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు.

నోట్: ఈ లక్షణాలు మీలో కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి.