పుచ్చగింజల వల్ల అన్ని లాభాలా..?

సమ్మర్ వచ్చేస్తోంది. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఫ్రూట్ పుచ్చకాయ

మార్కెట్ నుండి చక చక తెచ్చేసి.. ముక్కలుగా కోసి తినేస్తుంటారు

హలో ముక్కలు తినేసి.. గింజలు ఊసేస్తున్నారా.. అయితే ఆగండి

దీనిలో చాలా లాభాలున్నాయి.. తెలిస్తే.. వదిలిపెట్టరు

పుచ్చకాయ గింజల్లో విటమిన్స్ తో పాటు ఐరన్, పొటాషియం, పాస్పరస్ మాత్రమే కాదూ

మెగ్నీషియం, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా లభిస్తాయి.

పుచ్చకాయలో ఉండే నీరు..  వేడిని తగ్గిస్తే..

పుచ్చకాయ గింజలు..   రోగ నిరోధక శక్తి పెంచుతాయి

గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి

గింజల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి

ఎల్ సిట్రులిన్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలకు బలాన్ని అందిస్తుంది

పుచ్చ గింజల్ని ఎండబెట్టి.. వేయించుకుని తినొచ్చు

లేదంటే  పౌడర్ చేసుకుని.. పాలల్లో కూడా కలిపి తాగొచ్చు

అలాగే నీటిలో మరగించి.. టీలా స్వీకరించొచ్చు.

ఇలా తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు కరుగుతాయి