చలికాలంలో చెవి నొప్పితో బాధ పడుతున్నారా? ఇలా చేయండి!

చలికాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. 

ముఖ్యంగా చలికాలంలో చాలా మందికి చెవి నొప్పి అనేది వస్తుంది.

వాతావరణంలో మార్పులు, సైనస్ ఇన్ఫెక్షన్లతో సహా అనేక కారణాలతో చెవి నొప్పి వస్తుంది

ఇలా వచ్చే చెవి నొప్పి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. 

చలికాలంలో వచ్చే చెవి నొప్పి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ చెవులను రక్షించడానికి, వేడిగా ఉండేందుకు ఒక జత ఇయర్‌మఫ్‌లను వాడండి.

చెవులను కప్పి ఉంచే టోపీని ధరించడం ద్వారా చల్ల గాలి నుండి మీ చెవులను కాపాడుకోవచ్చు.

ఉన్నితో తయారు చేసిన టోపీలు, దుస్తులు, ఇయర్‌మఫ్‌లను వాడాండి.

వర్షం లేదా మంచు వాతావరణంలో మీ చెవుల్లో ఎక్కువ నీరు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.

చర్మ ఆరోగ్యంతో సహా మీ మొత్తం ఆరోగ్యానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగటం చాలా అవసరం. 

చెవులు పొడిబారకుండా ఉండటానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయండి.

చాలా మంది చెవులను నీట్ గా ఉంచేందుకు పదేపదే శుభ్రంచేస్తుంటారు.

ఇలా పదే పదే చెవులను శుభ్రం చేయడం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. 

చెవులను చాలా లోతుగా శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ ఉపయోగించవద్దు.

ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సలహాల ప్రకారం పై సమాచారం ఇవ్వడం జరిగింది.

మొత్తంగాచలికాలంలో చెవి నొప్పిగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.