పిచ్చి చెట్ల పండ్లు అనుకుంటే పొరపాటే..! వందల వ్యాధులకు దివ్యౌషధం.

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. అలాంటి వాటిలో ఈ నక్కెర కాయల చెట్టు కూడా ఒకటి.

చెట్టునిండా పళ్ళతో రోడ్డుపక్కన ఈ చెట్టు చాలా చోట్ల కనిపిస్తుంటాయి.కానీ, ఈ చెట్టును పిచ్చి చెట్టు అనుకోని అంతగా ఎవరూ పట్టించుకోరు.

కానీ,ఈ చెట్టు నుంచి వచ్చే పండ్లు ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీటిలో అనేక పోషకాలు దాగివున్నాయి.

ముఖ్యంగా ఈ నక్కెర పండ్లలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ మరియు కాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి.

దీంతో పాటు పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.

అయితే చెట్టు కాయలు ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ఆకుప‌చ్చ రంగులో, అలాగే పండిన త‌రువాత లేత ఎరుపు రంగులోకి మారుతాయి.

ఇక వీటిని తినడం వలన డయాబెటిస్‌ అదుపులోకి వస్తుందని చాలా అధ్యయనంలో తేలింది.

అలాగే మలబద్ధకం అజీర్తి గ్యాస్ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

దీంతో పాటు దురద, అలెర్జీ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ మొక్క సహాయపడుతుంది.

అంతేకాకుండా గొంతు నొప్పిని తగ్గించడానికి ఈ చెట్టు బెరడు కషాయం ఎంతగానో  పనిచేస్తుంది.

అలాగే నోటిపూత సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఈ పండును తింటే ఆ సమస్య తగ్గుతుంది.

ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మహిళలకు వచ్చే నొప్పికి ఈ చెట్టు బెరడు కషాయం మంచి  ఉపశమనం అందిస్తుంది.

ఇక పండ్ల నుంచి తీసిన రసాన్ని జుట్టు మీద అప్లై చేయడం వల్ల నెరిసిన జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

అలాగే ఈ చెట్టు పండ్ల వలన తలనొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పండ్లు అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

కనుక వీటిని రోజుకు  5 నుంచి 10 వరకు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం