కల్కిలో నాని- నవీన్ పొలిశెట్టి.. కన్ఫమ్ చేసిన నాగ్ అశ్విన్!

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో కల్కి 2898 ఏడీ సినిమా పేరు తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమా అటు బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే అటు నార్త్ అమెరికాలో 14.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది.

నార్త్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసి.. సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించింది.

కల్కి సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ అనే చెప్పాలి.

ఆ తర్వాత అమితాబ్, ప్రభాస్ యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

అంతేకాకుండా ఈ సినిమాలో చాలానే క్యామియోలు ఉన్నాయి.

ఆర్జీవీ, రాజమౌళి, దుల్కర్, విజయ్ దేవరకొండ, మృణాళ్, ఫరియా, అనుదీప్ అలరించారు.

అంటే దాదాపుగా వైజయంతి మూవీస్ లో పనిచేసిన అందరినీ వాడేశారు.

కానీ.. నాని, నవీన్ పొలిశెట్టి మాత్రం సినిమాలో కనిపించలేదు.

అదే విషయంపై నాగ్ అశ్విన్ స్పందించాడు.

కల్కి పార్ట్ 2లో ఏదో ఒక చోట వాళ్లని కూడా ఇరికిస్తాను అని కన్ఫామ్ చేశాడు.

అంటే నాని, నవీన్ పొలిశెట్టి కల్కి 2లో నటించబోతున్నారు.

ప్రస్తుతం కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా రూ.800 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.