కల్కి నటీ, నటుల రెమ్యూనరేషన్.. ప్రభాస్ కు ఏకంగా అన్ని కోట్లా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'

పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు.. సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

ఈ నేపథ్యంలో కల్కి నటీ, నటుల రెమ్యూనరేషన్ కు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

మరి ఈ మూవీ కోసం ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కల్కి మూవీ కోసం ప్రభాస్ ఏకంగా రూ. 150 కోట్లు తీసుకున్నాడని టాక్.

ఇక అమితాబ్, కమల్ హాసన్ లు ఈ చిత్రానికి తలా రూ. 20 కోట్లు తీసుకున్నారని సమాచారం.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె రూ. 15 కోట్లు అందుకున్నట్లు బీటౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మిగతా నటీ, నటులకు, టెక్నీషియన్లకు కలిపి దాదాపు రూ. 60 కోట్లు పారితోషికాల కింద ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

రూ. 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి మూవీలో పారితోషికాలకే రూ. 250 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

మరి  విజువల్ వండర్ గా హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న కల్కి ఏ రేంజ్ లో వసూళ్లను సాధిస్తుందో చూడాలి.