మగవారిలో వీర్యం వేగంగా వృద్ధి కావాలంటే.. ఇవి తింటే చాలు!

ఇటీవల మగవారిలో వీర్య కణాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని నివేదికలు చెబుతున్నాయి.

జంగ్ ఫుడ్, మద్యం సేవించడం, సిగరెట్ కాల్చడం,గాలి కాలుష్య ఇలా ఎన్నో కారణాల వల్ల వీర్య కణాలు తగ్గిపోతున్నాయని నిపుణులు అంటున్నారు.

వీర్య కణాల సంఖ్య పెరగటానికి సరైన ఆహారం తీసుకుంటే చాలు అంటున్నారు వైద్యులు.

అరటి పండులో విటమిన్ ఎ, బి1, సి పుష్కలంగా ఉన్నాయి. ఇది మగవారిలో వీర్య కణాలు ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

క్యారెట్ తింటే కళ్లకు మేలు చేస్తుంది.. అంతే కాదు స్పెర్మో ఉత్పత్తి మొత్తాన్ని పెంచుతుంది.

దానిమ్మలో అద్భుత ఔషదాలు దాగి ఉన్నాయి. ఇది తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి సెర్మ్ ఉత్పత్తి పెంచుతుంది. అంగస్తంభన కలిగేలా చేస్తుంది.

గుమ్మడి గింజలు తింటే శరీరంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ల సరఫరా పెరుగుతుంది. ఇది పురుషల్లో వీర్య కణాల అభివృద్దికి తోడ్పడతాయి.

చిక్కుళ్లు, బార్లీ, మాంసం వంటి జింక్ ఎక్కువగా ఉండే ఆహారం తింటే వీర్య కణాల సంఖ్య వృద్ది చెందుతుంది.

అక్రోట్ల(వాల్‌నట్స్‌)లో ఒమేగా -3 రెగ్యూలర్ గా తింటే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

పాల కూర తింటే చాలా మంచింది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల వీర్య కణాలు వృద్ది చెందుతాయి

టమాటాలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుతుగుంది..  సంతాన సామర్థ్యం కలిగేలా చేస్తుంది.

గుడ్లు వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీర్య కణాల చురుకుగా కదలడానికి సహకరిస్తాయి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం