IT శాఖ కీలక హెచ్చరిక.. ఆ తప్పుకు 10లక్షల జరిమానా!

ప్రభుత్వం నిర్దేశించిన దానికి మించి ఆదాయం వచ్చే వారు తప్పనిసరిగా పన్ను చెల్లించాలి

ఎంతో మంది తమ వంతు బాధ్యతగా ట్యాక్స్ ను  చెల్లిస్తున్నారు.

 పన్ను చెల్లించే విషయంలో కొన్ని అంశాలను దాస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది

కొన్ని విషయాలను దాస్తే.. రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుందని IT శాఖ హెచ్చరిస్తుంది.

ఆఖరి నిమిషంలో రిటర్నులు ఫైల్‌ చేసే సందర్భంలో హడావుడిలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. 

IT రిటర్నులకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో IT శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

విదేశాల్లోని ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన వివారాలను IT రిటర్నుల్లో వెల్లడించాలని స్పష్టం చేసింది.

ఆ ఆస్తుల వివరాలు వెల్లడించకుంటే 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

విదేశాల్లో ఉండే ఆస్తుల గురించి వెల్లడించకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయట

2023-24 ఆర్థిక సంవత్సరం కోసం ITR దాఖలు చేసేందుకు 2024 జూలై 31 చివరి తేదీ

విదేశాల్లో ఉద్యోగం చేసేవారైతే.. అక్కడ పొందే జీతాన్ని ITRలో ఇన్‌కం ఫ్రమ్‌ శాలరీ హెడ్‌లో పేర్కొనాలి.

 ఒకవేళ మీకు ఇప్పటికే అడ్వాన్స్‌ ట్యాక్స్‌ కట్‌ అయితే.. మీరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు అని ITశాఖ తెలిపింది.