మీ శరీరానికి సరిపడా నీరు అందుతుందా? ఇలా చెక్ చేయండి!

మనిషి శరీరంకి నీరు ఎంతో అవసరం అనే విషయం ప్రతి ఒక్కరి తెలుసు.

తగినంత నీరు తాగడం వల్ల దాహాన్ని తీర్చడం కంటే ఎక్కువే మేలు చేస్తుంది.

నేటి బిజీబిజీ లైఫ్ లో నీరు తాగడం మర్చిపోయి.. అనారోగ్య పాలవుతున్నారు.

మన శరీరానిక సరిపడా నీరు అందుతుందా లేదా అని  చెక్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి తగినంత నీరు సరిపోయిందా లేదా అనేది యూరిన్ రంగు బట్టి తెలుసుకోవచ్చు.

 ముదరు పసుపు రంగులో యూరిన్ ఉంటే బాగా హైడ్రేట్ శరీరాన్ని సూచిస్తాయి.

అరుదుగా మూత్రానికి వెళ్తూ ఉంటే.. తగినంత నీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

మనం దాహం వేస్తేనే కాకుండా మాములుగానే గంటకు ఒక సారైనా నీరు తాగడం మంచింది.

మన శరీరానికి తగినంత నీరు అందుతుందో లేదో చెప్పేందుకు చర్మం కూడా సాయ పడుతుంది.

మన చర్మం నిర్జీవంగా, పేలవంగా ఉంటే తగినంత నీరు తాగడం లేదని అనుకోవచ్చు.

ఆకస్మిక శరీరం బరువులో వచ్చే మార్పులు కూడా మీ హైడ్రేషన్ స్థితిని సూచిస్తాయి.

ఆహారం తీసుకోవడం, వ్యాయామం వంటి కారణాల వల్ల బరువు కొద్దిగా మారడం మాములే.

కానీ మన పనుల్లో మార్పు లేకుండా అకస్మికంగా బరువు తగ్గడం నిర్జలీకరణాన్ని సూచిస్తుంది.

అలానే అకస్మాతుగా బరువు పెరగడం కూడా నీటి నిలువుదలను సూచిస్తుంది. 

పై సమాచారం నిపుణులు నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. 

ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.