Off-white Banner

జ్యూస్‌ మంచిదా, పండ్లను నేరుగా తీసుకోవడం మంచిదా.?

ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

సీజన్‌లా వారిగా దొరికే పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచింది.

పండ్లలో ఉండే పోషకాలు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కపాడతాయి.

అయితే చాలా మంది పండ్లను తినడానికి బదులుగా జ్యూస్‌గా తాగడానికి ఇష్టపడతారు.

అయితే పండ్లను నేరుగా తినడం మంచిదా.. లేక జ్యూస్‌గా  తాగడం మేలా అంటే.

పండ్లను జ్యూస్‌గా తీసుకోవడం కన్నా నేరుగా తినడమే మంచిది అంటున్నారు వైద్యులు.

కొన్ని రకాల పండ్లను జ్యూస్‌గా తీసుకుంటే.. వాటిలో ఉండే ఫైబర్‌తో పాటు సూక్ష్మపోషకాలు నశిస్తాయి అంటున్నారు.

అలానే పండ్ల రసాల్లో ఫ్రక్టోజ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది.

జ్యూస్‌లలో ఫ్రక్టోజ్‌ ఎక్కువగా ఉండటం వల్ల.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడతారని వెల్లడించారు.

పండ్ల రసాలు ఎక్కువగా తాగడం వల్ల చిగుళ్ల సమస్యలు వచ్చే  అవకాశం ఉంది.

పండ్లను  జ్యూస్‌గా చేసినప్పుడు  ఫైబర్‌ తొలగిపోతుంది.

కనుక రోజుకు ఒక గ్లాస్‌కు మించి జ్యూస్‌ తాగకూడదు అంటున్నారు నిపుణులు.

అలానే ఉదయాన్నే పరిగడుపున జ్యూస్‌ తాగడం మానుకోవాలని చెబుతున్నారు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్‌ తాగితే.. ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. 

కనుక ఏదైనా తిన్న  తర్వాతే జ్యూస్‌ తాగాలి. 

మధ్యాహ్నం పూట జ్యూస్ తాగడం వల్ల మరింత మేలు జరుగుతుంది అంటున్నారు.

ఒకవేళ జ్యూస్‌ తీసుకోవాలనే ఆసక్తి ఉంటే పిప్పిని ఫిల్టర్‌ చేయకుండా తీసుకుంటే మేలంటున్నారు.

ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.