నిలబడి నీళ్లు తాగితే ప్రమాదమా.. వైద్యులేమంటున్నారంటే

పరిగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం మేలని సామెత. సామెత సంగతి పక్కన పెడితే.. నిలబడి నీళ్లు తాగితే మంచిదేనా..

ఎందుకుంటే.. కొన్ని ఇళ్లలో నిలబడి నీళ్లు తాగితే పెద్దవాళ్లు తిడతారు.

ఎందుకంటే నిలబడి నీళ్లు తాగితే.. అనేక అనారోగ్య సమ్యసలు వస్తాయి అంటారు.

నిలబడి నీరు తాగితే.. కీళ్లు దెబ్బతింటాయని చెబుతారు.

మరి నిజంగానే పెద్దలు చెప్పినట్లు నిలబడి నీళ్లు తాగడం ప్రమాదమా.. నిపుణులు ఏమంటున్నారంటే..

నిలబడి నీళ్లు తాగితే కాళ్లకు, శరీరానికి హాని కలుగుతుంది అంటారు పెద్దలు.

అయితే శాస్త్రీయంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేవని ఐసీఎంఆర్‌ తెలిపింది.

నిలబడి నీళ్లు తాగితే సమస్యలు వస్తాయని భావించడం కేవలం అపోహ అంటున్నారు.

నిలబడి, కూర్చొని.. ఎలా నీళ్లు తాగినా ప్రమాదం లేదంటున్నారు వైద్యులు.

రోజుకు సరిపడా నీళ్లు తాగామా లేదా అన్నది ముఖ్యం కానీ.. ఎలా తాగాం అన్నది కాదు అంటున్నారు.

నిలబడి, కూర్చొని.. ఇలా ఎలా తాగినా ఏం కాదు.. కానీ వేగంగా మాత్రం నీళ్లు తాగవద్దంటున్నారు నిపుణులు.

అలానే కొందరు పడుకుని.. అలానే నీళ్లు తాగుతారు.

ఇది కూడా ప్రమాదకరమైన అలవాటు అంటున్నారు వైద్యులు.

కనుక అపోహలను పట్టించుకోకుండా.. సరిపడా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం