సపోటా పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

సపోటా పండులో ఎన్నో పోషక పదార్ధాలు దాగి ఉన్నాయి.

ఈ పండులో విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ వృద్దాప్యంలోకంటిచూపు మెరుగుపరుస్తుంది.

సపోటాలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి సమస్యలను నివారిస్తుంది.

సపోటా జ్యూస్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.. నాడీ వ్యవస్థను రిలాక్స్ గా ఉంచుతుంది.

సపోటా జ్యూస్ లో ఉండే విటమిన్ ఎ లంగ్స్, సర్వికల్ క్యాన్సర్ ని నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.

సపోటా జ్యూస్ తాగడం వల్ల రక్త ప్రసరణ చాలా వరకు మెరుగుపడుతుంది.

సపోటాలో ఉండే క్యాల్సిక్ష్ం ఎముకలను బలంగా మార్చుతుంది. గర్బిణిలకు శక్తినిస్తుంది.

ఇందులో విటమిన్ సి వ్యాధి నిరోధకత పెంచడంలో సహాయపడుతుంది.

సపోటాలో ఉండే విటమిన్ ఏ, బి చర్మ సౌందర్యం పెంచుతుంది.

సపోటా లోని యాంటీ- ఆక్సిడెంట్లు, పోషకాలు, పీచు పదార్ధాలు క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఇందులో ఉండే విటమిన్ ఏ ఉపిరితిత్తులు, నోటి క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

నిద్రలేమి, ఆందోళన, మానికస ఒత్తిడి ఉన్నవారికి సపోటా జ్యూస్ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు.

సపోటా దెబ్బలు తగిలినపుడు రక్తస్త్రావాన్ని నివారిస్తుంది.