తరచూ కళ్లు తిరుగుతున్నాయా..?  అయితే ఈ లోపాలున్నట్లే..?

సాధారణంగా మనకు ఒక్కొక్క సారి కళ్లు, తల తిరుగుతుంటాయి

ఎండలో నడిచినప్పుడు, పొద్దున్న లేవగానే,  సరైన ఆహారం తీసుకోనప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి

అలసట, తరచూ కళ్లు తిరగడం, మగతగా అనిపిస్తూ ఉంటుంది

ఈ విషయాన్ని చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా ఆడవాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి.  ఆహారం, నీళ్లు లేక తీసుకోక అని భావిస్తుంటారు

కానీ  వీటికి కూడా వేరే కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచూ కళ్లు తిరుగుతున్నాయంటే  రక్త హీనతకు సింటమ్ అని చెప్పుకోవచ్చు.

వెర్టిగో వంటి సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది.

మెదడు, నరాలు లేదా చెవిలోపల ఏదైనా సమస్య ఉంటే ఇది సంభవిస్తుంది.

ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా కళ్లు షేక్ ఇస్తుంటాయి

నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

అలాగే  ఆహార లోపం వల్ల కూడా కళ్లు తిరగడం, అలసట వస్తుంటాయి.

శరీరానికి అందాల్సిన మోతాదులో నీళ్లు చేరకపోయినా.. ఇలా జరుగుతూ ఉంటుంది.

కళ్లు, తల తిరగడం అనేది  కొన్ని సందర్భాల్లో బ్యాడ్ సిగ్నల్స్ కూడా కావొచ్చు

ఆ సమయంలో వైద్యుడ్ని సంప్రదించి టెస్టులు చేయించుకోవడం మంచిది

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం