వందేళ్లు బతకాలంటే.. ప్రతి ఏటా 5 రకాల రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందే!

మనకు వచ్చే అనారోగ్యాల్లో కొన్నింటి లక్షణాలు ముందుగానే తెలుస్తాయి.

కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి లక్షణాలు అసలు బయటపడవు.

వ్యాధి వచ్చి.. ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు బయటపడతాయి.

అప్పుడు ప్రాణాలు పోవడం తప్ప మనం చేయగలిగేది ఏం ఉండదు.

మరి ఈ జబ్బులను ముందుగానే గుర్తించలేమా..  అంటే అందుకు ఓ మార్గం ఉంది.

అనారోగ్యం బారిన పడినా.. పడకపోయినా.. ప్రతి ఏటా కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలు చేయించుకోవాలి.

ఇలా చేస్తే.. కొన్ని ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తించి.. ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

ప్రతి ఏటా సీబీసీ టెస్ట్‌ చేయించుకోవాలి.

దీని వల్ల ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌ కౌంట్స్‌ను తెలుసుకోవచ్చు.

దాంతో పాటు.. రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉంటే ముందుగానే గుర్తించవ్చు.

రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.

అందుకోసం ప్రతి ఏటా లిపిడ్‌ ప్రొఫైల్‌ టెస్ట్‌ చేయించుకోవాలి.

మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలిస్తూ ఉండాలి.

ఇందుకోసం ప్రతి ఏటా గ్లూకోజ్‌, హేచ్‌బీఏ1సీ రక్త పరీక్షలు చేయించుకోవాలి.

నేటి కాలంలో మహిళలను ఎక్కువగా వేధిస్తున్న సమస్య థైరాయిడ్‌.

ఈ హర్మోన్‌ పరిమాణం పెరిగినా.. తగ్గినా సమస్యే.

అందుకే ప్రతి ఏటా థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయిలను చెక్‌ చేసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవాలి.

శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం, క్లోరైడ్‌, బైకార్బొనేట్‌, అల్బుమిన్‌, బిలిరుబిన్‌ వంటి మూలకాలు

సరైన మోతాదులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సీఎంపీ రక్త పరీక్ష అవసరం.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం