Tooltip

గురివింద గింజలు ఇలా వాడితే వద్దన్నా జుట్టు పెరుగుతుంది..!

గురివింద గింజలు అంటే పట్నం వాసులకు, ఈ కాలం పిల్లలకు పెద్దగా తెలియకపోవచ్చు.

కానీ పల్లెల్లో ఉన్న వారికి ఇవి బాగా పరిచయం. ఎరుపు, నలుపు రంగుల్లో చిన్నగా, ముద్దుగా ఉంటాయి.

ఈ తీగలు పంట పొలాల ద‌గ్గ‌ర‌, చేల కంచెల వెంబ‌డి విపరీతంగా కనిపిస్తుంటాయి.

ఆయుర్వేద షాపుల్లో అమ్ముతుంటారు.  ఇప్పుడు ఆన్‌లైన్‌ మార్కెట్లోనూ ఇవి దొరుకుతున్నాయి.

గురివింద చెట్టు ఆకులు, కాండంలో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఇక జుట్టు సమస్యలకు గురివింద గింజలు మంచి పరిష్కారం.

జుట్టు రాలడం, తలలో దురద, చుండ్రు వంటి సమస్యలను గురివింద గింజలతో నయం చేసుకోవచ్చు.

జుట్టు సమస్యలు ఉన్న వారు  గురివింద గింజ‌ల‌ను ఇలా వాడాలి.

ఈ గింజలను తీసుకుని  చిన్న చిన్న పప్పులుగా చేసుకోవాలి.

ఆ తర్వాత వాటిని ఒక మందపాటి బట్టలో పోసి మూట కట్టాలి.

ఆపై ఒక గిన్నెలో అర గ్లాసు పాలు పోసుకుని, ఇందులో గురివింద గింజ‌ల మూట వేయాలి.

పాలు పూర్తిగా ఆవిరై పోయే వ‌ర‌కు మ‌రిగించిన తర్వాత ఆ మూట‌ను తీసి ప‌క్కకు పెట్టాలి.

మరొక గిన్నెలో 100 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవాలి.

దీనికి ఒక స్పూన్ గుంట‌గ‌ల‌గ‌రాకు పొడిని క‌ల‌పాలి.

 ఆ తర్వాత ఉడికించిన గురివింద గింజ‌ల ప‌ప్పు కూడా వేసి క‌ల‌పాలి.

ఈ మిక్చర్ ని పొయ్యి మీద పెట్టి 5 -7 నిమిషాల వరకు మరిగించి చల్లారబెట్టాలి.

ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి.

రాత్రి పడుకొనే ముందు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు ఈ నూనెను పట్టించాలి.

తర్వాత రోజు ఉదయం తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల క్రమంగా జుట్టు రాల‌డం త‌గ్గడమే కాక జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది.

దుర‌ద‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు కనుమరుగవుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం